మన పత్రిక: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో వంశీ అనే యువకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో స్థానికంగా దిగ్భ్రాంతి వ్యక్తమైంది. తన మరణానికి వేరే ఏ వ్యక్తి బాధ్యుడు కాదని స్పష్టం చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ విధానాలే తన నిర్ణయానికి కారణమని ఆ లేఖలో పేర్కొన్నాడు.
విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిరుద్యోగం లేదా ఇతర వ్యక్తిగత కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
