Advertisement

హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

మన పత్రిక, హైదరాబాద్: నగరంలోని డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పోలీస్ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

వాష్‌రూమ్‌లో ఘటన

ఈ రోజు ఉదయం 5:30 గంటల సమయంలో కానిస్టేబుల్ స్వామి వాష్‌రూమ్‌లోకి వెళ్లి స్వయంగా కాల్చుకున్నారు. తుపాకీ శబ్దం విన్న సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకోగా, ఆయన రక్తపు మడుగులో పడి ఉన్నారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

Advertisement

సూసైడ్ నోట్ కలకలం

ఘటనా స్థలంలో పోలీసులు ఒక నోట్‌బుక్‌లో రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తన భార్య, పిల్లల పట్ల ఉన్న ప్రేమను స్వామి వ్యక్తం చేశారు. తన భార్య, పిల్లలు చాలా మంచివారని పేర్కొంటూ, తాను చనిపోయిన తర్వాత కూడా వారిని దెయ్యం రూపంలోనైనా జాగ్రత్తగా చూసుకుంటానని అందులో రాశారు. ఆ కుటుంబానికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement