మన పత్రిక, తిరుపతి: తిరుమల ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద జరిగిన ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించిన తిరుపతి జిల్లా పోలీసులను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అభినందించారు. వేగవంతమైన దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు, స్వామివారి విగ్రహాన్ని సురక్షితంగా స్వాధీనం చేసుకోవడం పోలీసుల సమర్థతకు నిదర్శనమని ఆయన కొనియాడారు.
తిరుమల వంటి పవిత్రమైన క్షేత్రాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లను తక్షణమే పటిష్ఠం చేయాలని ఆయన సూచించారు. ఆలయ ప్రాంగణాల్లో సీసీటీవీ నిఘాను నిరంతరం పర్యవేక్షించాలని, గస్తీని పెంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భద్రతను అమలు చేయాలని చెప్పారు. దేవతా విగ్రహాలను అపహరించడం లేదా ఆలయ ఆస్తులతో ఆడుకునే వారిపై కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి హెచ్చరించారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
- రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి: కేటీఆర్ హెచ్చరిక
- హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనమ్ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
- విజయ్ నటన నుంచి నిష్క్రమణలో వచ్చిన జనా నాయకుడు చిత్రం విశేషాలు
- ఢిల్లీలో మెట్రో స్టేషన్ల మూసివేతపై సుప్రీంకోర్టు స్పందన
- రూ. 4.25 లక్షలకు కొన్న బంగళా ఇప్పుడు రూ. 450 కోట్ల ఆస్తిగా మారిన వైనం
