మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక విద్యార్థిని ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ లూనార్ మిషన్‌కు ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించారు. ధవళేశ్వరంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కందుల జెస్సీ ఈ అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆమె ప్రతిభను గుర్తించిన రాష్ట్ర మంత్రి లోకేశ్, జెస్సీని ప్రత్యేకంగా అభినందించారు.
శాస్త్రవేత్తలతో కలిసి పనిచేయనున్న జెస్సీ
ఎంపికైన ఈ గ్లోబల్ లూనార్ మిషన్‌లో భాగంగా కందుల జెస్సీ మిషన్ శక్తిశాట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రముఖ శాస్త్రవేత్తలతో కలిసి పనిచేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తూ అంతర్జాతీయ స్థాయి మిషన్‌లో భాగస్వామి కావడం పట్ల పలువురు ఆమెను ప్రశంసిస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
