Advertisement

నందమూరి బాలకృష్ణ కాలికి గాయం, నిలిచిపోయిన ఎన్బీకే111 షూటింగ్

మన పత్రిక: నందమూరి బాలకృష్ణ కాలికి గాయం కావడంతో ఆయన నటిస్తున్న ఎన్బీకే111 షూటింగ్ నిలిచిపోయింది. కాకినాడ సమీపంలో సినిమా చిత్రీకరణ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన బాలకృష్ణను రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు ఎయిర్‌లిఫ్ట్ చేసి ఏఐజీ హాస్పిటల్స్‌లో చేర్పించారు. ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యుల బృందం, ఈరోజు లేదా రేపు శస్త్రచికిత్స చేసే అవకాశం ఉందని హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి మరియు శస్త్రచికిత్స తర్వాత కోలుకోవడానికి పట్టే సమయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఆయన కనీసం ఒక నెల రోజుల పాటు షూటింగ్‌లకు, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలకు దూరంగా ఉండాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రభావంతో ఇప్పటికే సినిమా చిత్రీకరణ వాయిదా పడింది. ఈ ఏడాది డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయాలని భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది కష్టమని తెలుస్తోంది. బాలకృష్ణ కోలుకునే వేగాన్ని బట్టి, సినిమాను సంక్రాంతికి లేదా 2027 వేసవికి విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

Advertisement
Advertisement