మన పత్రిక, తెలంగాణ: తెలంగాణలో నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తి పుష్కలంగా ఉన్నప్పటికీ, మార్కెట్లో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. గత రెండున్నర నెలల వ్యవధిలోనే కేజీ సన్న బియ్యం ధర రూ. 10 నుంచి రూ. 12 వరకు పెరిగింది. సోనా మసూరీ, బిపిటి, ఐఆర్-64 వంటి రకాల క్వింటాల్ ధర రూ. 1,000 నుంచి రూ. 1,500 వరకు పెరిగినట్లు సమాచారం. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అక్రమ నిల్వలకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
బియ్యం ధరల మంట చల్లారకముందే, ప్రొటీన్ ఆహార పదార్థాల ధరలు కూడా సామాన్యుడికి భారంగా మారాయి. ప్రస్తుతం కోడిగుడ్డు ధర రూ. 8.50కు చేరుకోగా, కేజీ లైవ్ డ్రెస్సింగ్ చికెన్ ధర రూ. 350 మార్కును తాకింది. దీంతో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు వీటిని కొనుగోలు చేయడానికి వెనకాడుతున్నాయి.
రైతుబజార్లలో కూరగాయల ధరలు
నిత్యావసరాలతో పాటు కూరగాయల ధరలు కూడా మండిపోతున్నాయి. రైతుబజార్లలో కూడా సామాన్యులకు ఉపశమనం లభించడం లేదు. మార్కెట్లో ప్రస్తుతం నడుస్తున్న కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి:
- టమాటా: కేజీ రూ. 40 నుంచి రూ. 60
- పచ్చిమిర్చి: కేజీ రూ. 40 నుంచి రూ. 60
- ఉల్లిపాయలు: కేజీ రూ. 40 నుంచి రూ. 55
- బెండకాయ / వంకాయ: కేజీ రూ. 40 నుంచి రూ. 50
- క్యారెట్ / బీట్రూట్: కేజీ రూ. 50 నుంచి రూ. 60
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- శ్రీకాకుళం జిల్లా ప్రతిష్టను దెబ్బతీశారు: మంత్రి అచ్చెన్నాయుడు
- ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చెలరేగిన హింస, పోలీసులపై రాళ్లదాడి
- రాజకీయ కుట్రలు పన్నుతున్నారంటూ బీఆర్ఎస్, బీజేపీలపై రేవంత్ రెడ్డి ఫైర్
- హైదరాబాద్లో ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్ నిరసన ర్యాలీ
- సీతక్కపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
