Advertisement

ఢిల్లీ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారిక పర్యటన నిమిత్తం బుధవారం ఉదయం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఉదయం 10 గంటల సమయంలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై బీద మస్తాన్ రావు యాదవ్ ముఖ్యమంత్రితో స్వల్పంగా చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో జరగనున్న సమావేశాలు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం నారా చంద్రబాబు నాయుడు పార్లమెంట్ హౌస్‌కు చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Advertisement
Advertisement