Advertisement

చలో సంసద్ పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

మన పత్రిక: కాక్రోచ్ జనతాపార్టీ (CJP) చేపట్టిన ‘చలో సంసద్’ నిరసనలో ఆందోళనకారులపై జరిగిన పోలీసు చర్యలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై అత్యవసర విచారణ చేపట్టేందుకు వీలులేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ఆయన కోరారు. నిరసనకారులపై జరిగిన లాఠీఛార్జి వీడియోలను పరిశీలించాలని న్యాయవాది కోరగా, తమకు వీడియోలు చూసే సమయం లేదని సీజేఐ వ్యాఖ్యానించారు.

ఈ వ్యవహారంలో అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే నిరాకరించడంతో, పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పోలీసు లాఠీఛార్జీపై కోర్టు పర్యవేక్షణలో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని పిటిషనర్ కోరారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యావ్యవస్థలో సంస్కరణలు తేవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ ‘చలో పార్లమెంట్’ కార్యక్రమంలో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, లాఠీఛార్జి చేశారు. ఆందోళనకారుల రాళ్లదాడి, తోపులాటలతో ఇరువైపులా పలువురికి గాయాలయ్యాయి.

Advertisement
Advertisement