Advertisement

తిరుమల ఏడో మైలు వద్ద ఆంజనేయస్వామి విగ్రహం చోరీ

మన పత్రిక, తిరుమల: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలోని మొదటి ఘాట్ రోడ్డులో ఉన్న 7వ మైలు వద్ద ఆంజనేయస్వామి విగ్రహం చోరీకి గురైంది. నిత్యం వందలాది మంది భక్తులు పూజించే ఈ ప్రాచీన విగ్రహం అక్కడ కనిపించకపోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. విగ్రహం లేని చోట భక్తులు నమస్కరించుకుంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, కాషాయ దుస్తులు ధరించిన ఒక వ్యక్తి విగ్రహాన్ని కాషాయ గుడ్డలో చుట్టి ఎవరికీ అనుమానం రాకుండా తీసుకెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు ఎటువైపు వెళ్లాడనే కోణంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుని విగ్రహాన్ని పునరుద్ధరిస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement