Advertisement

రంభ ఊర్వశి మేనక సినిమా నుండి నా కంటి మీద కునుకే పాట విడుదల

మన పత్రిక: అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫాంటసీ ఎంటర్టైనర్ రంభ ఊర్వశి మేనక చిత్రం నుండి తాజాగా మొదటి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ‘నా కంటి మీద కునుకే’ పేరుతో విడుదలైన ఈ పాట ద్వారా సినిమా ప్రమోషన్లను ప్రారంభించారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

ఈ పాట గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన మెలోడీగా రూపొందింది. ఇందులో అల్లరి నరేష్, సురభి మధ్య సాగే రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించారు. భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించగా, ధనుంజయ సీపాన ఆలపించారు. జిత్తు మాస్టర్ కొరియోగ్రఫీలో తెరకెక్కిన ఈ పాట విజువల్స్ పరంగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement
Advertisement