Advertisement

ఢిల్లీలో సీజేపీ ఆందోళనలో ప్రధాని మోడీపై యువకుడి అనుచిత వ్యాఖ్యలు

మన పత్రిక: ఢిల్లీలో జరుగుతున్న సీజేపీ ఆందోళన సమయంలో ఒక యువకుడు తీవ్ర అభ్యంతరకరమైన భాషను ఉపయోగిస్తూ ప్రధాని మోడీని దూషించాడు. తాను దొరికితే వదిలిపెట్టనని, కాల్చి చంపుతానని సదరు యువకుడు ఆగ్రహంతో ఊగిపోతూ హెచ్చరికలు జారీ చేశాడు. అంతేకాకుండా, ప్రధాని తల్లిని ఉద్దేశించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ దృశ్యాలు రికార్డైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నిరసనను శాంతియుతంగా కాకుండా ఇలాంటి భాషతో నిర్వహించడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు.

మరోవైపు, కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజిత్ దీప్కే ఈ ఘటనపై స్పందిస్తూ తాము దేశభక్తులమని, శాంతియుతంగానే నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద తప్ప ఢిల్లీలో మరెక్కడా తాము నిరసనలు చేపట్టడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా సీజేపీ పేరుతో గొడవలకు పాల్పడితే, వారితో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని దీప్కే తెలిపారు. పోలీసులు లాఠీ ఛార్జ్ చేసినప్పటికీ తాము ఎదురుదాడి చేయకుండా శాంతియుతంగానే ఉన్నామని ఆయన వివరించారు.

Advertisement
Advertisement