SC Gurukulas Employees Increament news: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో డిగ్రీ లెక్చరర్లకు ఇంక్రిమెంట్ ఇవ్వడంపై వివాదం నెలకొంది. పదోన్నతి పొందే అర్హతలు ఉంటేనే ఇంక్రిమెంట్ ఇస్తామని ప్రిన్సిపాల్స్ స్పష్టం చేయడంతో ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు.
2019 ఆగస్టులో విధుల్లోకి చేరిన డిగ్రీ లెక్చరర్లకు మాత్రమే ఈ కొత్త నిబంధన వర్తిస్తుండటం వింతగా ఉంది. లిఖితపూర్వక ఆదేశాలు లేకుండా ఇలాంటి నిబంధన విధించడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇంకోవైపు, 2017 నోటిఫికేషన్ ద్వారా నియమితులై, 2019 మార్చిలో విధుల్లోకి చేరిన లెక్చరర్లకు మాత్రం ఇంక్రిమెంట్లు విడుదల చేయడం గమనార్హం. ఇది సమానత్వం పై ప్రశ్నలు తలెత్తుతోంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
