Advertisement

తెలంగాణలో మరికొంత కాలం కొనసాగనున్న వర్షాలు

మన పత్రిక: తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడగా, మరికొన్ని చోట్ల తేలికపాటి చిరుజల్లులు నమోదయ్యాయి. ఈ ముసురు వాతావరణం రాష్ట్రంలో మరోరోజు కొనసాగుతుందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. ఉత్తర మరియు సెంట్రల్ తెలంగాణ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఆయన తెలిపారు.

ఆదిలాబాద్, అసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, కామారెడ్డి మరియు పెద్దపల్లి జిల్లాల్లో సాయంత్రం నుండి రాత్రి సమయాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, సెంట్రల్ మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు నమోదవ్వచ్చు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం వేళ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని, హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం నుండి రాత్రి వరకు చినుకులు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.

Advertisement
Advertisement