మన పత్రిక: ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తన తాజా సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డారు. కాకినాడ పోర్టులో జరుగుతున్న యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో ఉండగా, ప్రమాదవశాత్తూ ఆయన కాలు జారి పడటంతో మోకాలికి స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే బాలకృష్ణను ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందించారు. గాయం స్వల్పంగానే ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. యాక్షన్ సన్నివేశాలను డూప్ లేకుండా సొంతంగా నటించే క్రమంలో ఆయనకు ఈ గాయమైంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో నటుడు మంచు మనోజ్ కూడా అక్కడే ఉన్నారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
