Advertisement

సెన్సార్ పూర్తి చేసుకున్న కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ

మన పత్రిక: కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన Chennai Love Story చిత్రం సెన్సార్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు UA సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ముఖ్యంగా, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఒక్క కట్ కూడా సూచించకపోవడం విశేషం.

ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. చిత్రంలోని ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను అలరిస్తాయని చిత్రబృందం నమ్మకంతో ఉంది. నిర్మాతలలో ఒకరైన SKN ఈ చిత్రాన్ని కల్ట్ క్లాసిక్ అని పేర్కొన్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో వేచి చూడాలి.

Advertisement
Advertisement