Advertisement

లార్డ్స్ మైదానంలో గౌతమ్ గంభీర్‌ను పట్టించుకోని రోహిత్ శర్మ

మన పత్రిక: ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా ఓటమి పాలైంది. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో, ఇంగ్లాండ్ నిర్దేశించిన 388 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 360 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీతో మెరిసినప్పటికీ, కెప్టెన్ గిల్ మరియు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలు చేసినా జట్టును గెలిపించలేకపోయారు. కీలక దశలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ ఓటమి తప్పలేదు.

వైరల్ అవుతున్న వీడియో

మ్యాచ్ ముగిసిన తర్వాత, లార్డ్స్ మైదానంలోని పై లాంజ్ లో రోహిత్ శర్మ కూర్చుని ఉండగా, పక్కనే ఉన్న గౌతమ్ గంభీర్ ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే, గంభీర్ పదే పదే మాట్లాడుతున్నా రోహిత్ శర్మ ఏమాత్రం స్పందించకుండా పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్ శర్మ కెరీర్‌తో గంభీర్ ఆడుకున్నారని ఆరోపిస్తూ, రోహిత్ అభిమానులు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.

Advertisement
Advertisement