Advertisement

ఓటీటీలోకి వచ్చిన మలయాళ హార్రర్ థ్రిల్లర్ సీక్రెట్ ఆఫ్ కళింగ

మన పత్రిక: మలయాళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న హార్రర్ థ్రిల్లర్ చిత్రం ‘సీక్రెట్ ఆఫ్ కళింగ’ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ సినిమా జూలై 24 నుండి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వినూత్నమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చిత్ర విశేషాలు

సనీష్ ఉన్ని కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ధ్యాన్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించారు. జూన్ 18న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగా అలరించింది. జిష్ణు ఎమ్. ఆర్యన్ తో కలిసి రాసిన స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అశ్రిత్ సంతోష్ సినిమాటోగ్రఫీ అందించగా, ధనుష్ హరికుమార్, విమల్ జిత్ విజయన్ అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది.

Advertisement

ఈ చిత్రంలో మాళవిక మీనన్, అల్తాఫ్ సలీమ్, రియాజ్ ఖాన్, మెరీనా మైఖేల్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. ‘ఐరా’ బ్యానర్ పై నిర్మితమైన ఈ మిస్టరీ థ్రిల్లర్ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను సన్ నెక్స్ట్ సంస్థ సొంతం చేసుకుంది.

Advertisement