Advertisement

గుంటూరులో దారుణం: మహిళపై దాడి చేసి వివస్త్రను చేసిన టీడీపీ నేత కుటుంబం

మన పత్రిక, గుంటూరు: గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణబాబు కాలనీలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తాగునీటి మోటార్ ఏర్పాటు విషయంలో 21వ వార్డు తెలుగుదేశం పార్టీ (TDP) సెక్రటరీ మల్లెల మూర్తి కుటుంబ సభ్యులకు, ఒక స్థానిక మహిళకు మధ్య గొడవ జరిగింది. ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో మల్లెల మూర్తి కుటుంబం దారుణంగా ప్రవర్తించింది.

కొందరు వ్యక్తులను తోడు తెచ్చుకుని సదరు మహిళపై దాడికి దిగడమే కాకుండా, నడిరోడ్డుపై ఆమెను వివస్త్రను చేసి కాళ్లతో తంతూ హింసించారు. ఈ భయానక ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేగింది. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని ప్రభుత్వం చెబుతున్న వేళ, క్షేత్రస్థాయిలో జరిగిన ఈ ఘటన పాలకుల ఆశయాలకు విరుద్ధంగా ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement