Advertisement

అప్పుల బాధతో భర్త ఆత్మహత్య.. ఆ వేదనతో భార్య బలవన్మరణం

మన పత్రిక, వెబ్​‌డెస్క్

Advertisement

కాకినాడ: ఆర్థిక ఇబ్బందులతో(Financial problems) భర్త ఆత్మహత్య చేసుకున్న రెండు నెలలకే అతని భార్య తీవ్ర మనోవేదనకు గురై రెండేళ్ల కుమారుడికి విషమిచ్చి, తానూ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సర్పవరం భావనారాయణపురంలోని గాంధీనగర్‌లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనతో రెండు కుటుంబాలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి.

Advertisement

జనపల్లి గోపి అనే ఉద్యోగి కుమారుడి పుట్టినరోజు కోసం రూ. 3 లక్షల అప్పు చేసి, వాటిని తీర్చలేక జులై 22న ఆత్మహత్య(suicide) చేసుకున్నారు. భర్త మరణంతో కుంగిపోయిన అతని భార్య ఆకాంక్ష, గత నెల 31న తన రెండేళ్ల కుమారుడు సార్విక్‌తో కలిసి విషం తీసుకున్నారు. కుటుంబసభ్యులు వెంటనే వారిని కాకినాడ జీజీహెచ్‌లో చేర్చగా, పరిస్థితి విషమించడంతో తల్లీబిడ్డలు బుధవారం మృతిచెందారు. ఈ ఘటనపై సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement