Advertisement

బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం: 500 మందికి పైగా రోహింగ్యాల మృతి

మన పత్రిక: బంగాళాఖాతంలో జరిగిన అత్యంత విషాదకరమైన ప్రమాదంలో 500 మందికి పైగా రోహింగ్యా శరణార్థులు మరణించి ఉంటారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ (UNHCR) మరియు అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) ఆందోళన వ్యక్తం చేశాయి. మయన్మార్ నుంచి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లే క్రమంలో జరిగిన ఈ ఘటన మానవతా సంక్షోభ తీవ్రతను మరోసారి ప్రతిబింబించింది.

రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలు

జూన్ చివరి వారంలో మయన్మార్‌లోని రాఖైన్ రాష్ట్ర తీరం నుంచి సుమారు 250 మందితో బయల్దేరిన ఒక పడవ ప్రయాణం మొదలైన కొద్దిసేపటికే బాహ్య ప్రపంచంతో సంబంధాలను కోల్పోయింది. అలాగే, జూలై 8వ తేదీన సుమారు 280 మంది ప్రయాణికులతో వెళ్తున్న మరో పడవ అయేయార్వాడీ తీరంలో సముద్ర గర్భంలో కలిసిపోయింది. అంతర్జాతీయ వలసల సంస్థల ప్రాథమిక దర్యాప్తు నివేదికల ప్రకారం, ఈ రెండు పడవల్లో కలిపి మొత్తం 530 మందికి పైగా ప్రయాణికులు మరణించి ఉంటారని ఐక్యరాజ్యసమితి సంస్థలు అంచనా వేశాయి.

Advertisement
Advertisement