మన పత్రిక: తెలంగాణతో పాటు కర్ణాటక సహా మొత్తం నాలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ గడువును అధికారులు పొడిగించారు. ఇంటింటి సర్వే ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు బూత్ లెవల్ అధికారులకు అదనపు సమయాన్ని కల్పించారు.
ముసాయిదా మరియు తుది జాబితా విడుదల తేదీలు
తెలంగాణలో సవరించిన షెడ్యూల్ ప్రకారం, ఆగస్టు 10న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితా ప్రకటన ఉంటుంది.
కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ముసాయిదా జాబితా ఆగస్టు 17న మరియు తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 19న విడుదల కానున్నట్లు అధికారులు వెల్లడించారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
