Advertisement

సొంత ఖర్చులతోనే భుజం శస్త్రచికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన భుజం శస్త్రచికిత్సకు అవసరమైన ఖర్చులను సొంత నిధులతోనే భరించారు. ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నప్పటికీ, వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ సొమ్మును వాడకూడదనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రయాణ ఖర్చులతో సహా శస్త్రచికిత్సకు సంబంధించిన మొత్తం వ్యయాన్ని పవన్ కల్యాణ్ తన సొంత డబ్బులతోనే చెల్లించారు. మంత్రిగా వైద్య రీయింబర్స్‌మెంట్ పొందే అవకాశం ఉన్నప్పటికీ, ఆయన దానిని స్వీకరించడానికి నిరాకరించారు. గతంలో ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్న సమయంలో కూడా పవన్ కల్యాణ్ ఇలాగే సొంత ఖర్చులతోనే చికిత్స చేయించుకోవడం గమనార్హం.

Advertisement
Advertisement