Advertisement

మహిళా నేతపై వివాదాస్పద వ్యాఖ్యలు: యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడికి షోకాజ్ నోటీసులు

మన పత్రిక: మహిళా నేతపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డికి జాతీయ యూత్ కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వివాదాస్పద ఆడియో వైరల్ కావడంతో పాటు, రూ. 7 కోట్ల వ్యవహారానికి సంబంధించిన మరో ఆడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకున్న పార్టీ అధిష్టానం, దీనిపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆయనను ఆదేశించింది.

మరోవైపు, శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకునే దిశగా పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోంది.

Advertisement
Advertisement