Advertisement

మీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ గోడౌన్ దగ్ధం

మన పత్రిక, మీర్‌పేట: రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక ప్లాస్టిక్ వేర్‌హౌస్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది.

మంటలు గోడౌన్ నుంచి పక్కనే ఉన్న ఇతర భవనాలకు కూడా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement