Advertisement

ఘనంగా ‘1=100’ చిత్ర టీజర్ లాంచ్

మన పత్రిక: శకుంతల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాబా మైలవరం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘1=100’. ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. నిర్మాత రిజ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై టీజర్‌ను ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

సినిమా విశేషాలు

వెస్ట్రన్ స్టైల్ విజువల్స్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అనిల్ కుమార్ వేగూరు సినిమాటోగ్రఫీ అందించగా, కెన్నీ చైతన్య సంగీతం, నందమూరి హరి ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. టీజర్‌కు వస్తున్న స్పందనపై చిత్ర బృందం ఉత్సాహం వ్యక్తం చేసింది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని వారు పేర్కొన్నారు.

Advertisement

సాంకేతిక నిపుణులు

ఈ చిత్రానికి కొరియోగ్రఫీని సూర్యాస్ మాస్టర్, జోజో అందించగా, ఫైట్స్ మాస్టర్లుగా కృష్ణ ఎస్.ఎం. రాజు, డైమండ్ వెంకట్ వ్యవహరించారు. ఆర్ట్ డైరెక్టర్‌గా నానాజీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులను డిజిక్వెస్ట్ సంస్థ పర్యవేక్షిస్తోంది.

Advertisement