Advertisement

RAW ఎన్టీఆర్ సంస్థతో మాకు ఎటువంటి సంబంధం లేదు: జూనియర్ ఎన్టీఆర్ టీమ్

మన పత్రిక, హైదరాబాద్: స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘RAW ఎన్టీఆర్’ అనే సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కార్యాలయం మంగళవారం స్పష్టం చేసింది. ఈ సంస్థకు ఎన్టీఆర్ తరపున ప్రాతినిధ్యం వహించే ఎటువంటి హక్కు లేదని పేర్కొంది.

ఎన్టీఆర్ చేపట్టే సేవా కార్యక్రమాల వివరాలు కేవలం ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడి అవుతాయని కార్యాలయం తెలిపింది. ‘RAW ఎన్టీఆర్’ సంస్థ ప్రజల్లో ఎన్టీఆర్‌తో సంబంధం ఉన్నట్లు భ్రమ కలిగించేలా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి అనధికారిక సంస్థలు, వ్యక్తుల ద్వారా జరిగే ప్రచారాన్ని ఎవరూ పరిగణనలోకి తీసుకోవద్దని అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేసింది.

Advertisement
Advertisement