మన పత్రిక: అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలతో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూలై 14, మంగళవారం నాటి ధరల ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40,580 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,28,865గా నమోదైంది. వెండి ధర విషయానికి వస్తే, ఒక కేజీకి రూ. 2,17,750 పలుకుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఒక ఔన్స్ 4,000 డాలర్ల దిగువకు పడిపోయి, ప్రస్తుతం 3,990 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై నావికా దిగ్బంధనాన్ని తిరిగి విధిస్తున్నట్లు ప్రకటించడం మరియు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉండటంతో ఈ తగ్గుదల నమోదైనట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాబోయే రోజుల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కెవిన్ వార్ష్ సమర్పించబోయే మానిటరీ పాలసీ సమీక్ష మరియు అమెరికా విడుదల చేయనున్న ఆర్థిక నివేదికలు బంగారం ధరలపై ప్రభావం చూపనున్నాయి.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
ఇవి కూడా చదవండి :
- నేడు భారీగా తగ్గిన వెండి ధర.. స్వల్పంగా దిగివచ్చిన బంగారం రేట్లు
- కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం: జాగింగ్ చేస్తుండగా ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ మృతి
- అనంతపురంలో దారుణం: మద్యం కోసం వేధించిన కొడుకును కత్తెరతో పొడిచి చంపిన తల్లి
- సింగరేణిని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దోచుకున్నాయి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- షాబాద్ ఆరుగురి హత్యల కేసు: నిందితుడి సూసైడ్ నోట్లో సంచలన విషయాలు
