Advertisement

లిక్కర్ బాటిల్ 750ml పరిమాణంలోనే ఎందుకు ఉంటుంది?

మన పత్రిక, ఐరోపా: వైన్ మరియు లిక్కర్ బాటిళ్లు సాధారణంగా 750ml పరిమాణంలో ఉండటం వెనుక చారిత్రక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పాత రోజుల్లో ఐరోపాలో గ్లాస్ బాటిళ్లను యంత్రాల ద్వారా కాకుండా మనుషులే మాన్యువల్‌గా తయారు చేసేవారు. కరిగించిన గాజును గొట్టం ద్వారా నోటితో ఊది ఆకారాన్ని ఇచ్చేవారు. అప్పట్లో తయారీదారుల ఊపిరితిత్తుల సామర్థ్యం ఆధారంగా, ఒకేసారి ఊదగలిగే గ్లాస్ బాటిల్ పరిమాణం సుమారు 750ml మాత్రమే ఉండేది. ఈ పరిమాణం క్రమంగా ప్రామాణికంగా మారిపోయింది.

బ్రిటిష్ మెజర్మెంట్ సిస్టమ్ (British Measurement System) కూడా ఈ సైజు నిర్ణయంలో కీలక పాత్ర పోషించిందని మరొక వాదన ఉంది. ఆధునిక సాంకేతికతతో యంత్రాల ద్వారా బాటిళ్లను తయారు చేస్తున్నప్పటికీ, పాతకాలం నాటి ఈ కొలత పద్ధతి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలో స్థిరపడి కొనసాగుతోంది.

Advertisement
Advertisement