Advertisement

ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

మన పత్రిక, ముంబై: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంబైలోని ఆసుపత్రిని సందర్శించారు. పవన్ కల్యాణ్ భుజానికి సుమారు మూడున్నర గంటల పాటు శస్త్రచికిత్స జరిగిందని చంద్రబాబు వెల్లడించారు. పవన్ ఒక భుజంతో పాటు రెండో భుజానికి కూడా సమస్య ఉందని వైద్యులు గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రజల మధ్య నిరంతరం ఉంటూ పని ఒత్తిడికి గురికావడం వల్లే పవన్ కల్యాణ్ భుజానికి గాయమైందని వైద్యులు వివరించారు. ఈ శస్త్రచికిత్స అనంతరం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు కనీసం మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ చంద్రబాబు పరామర్శ పూర్తి చేశారు. వైద్యుల సూచనల మేరకు పవన్ కల్యాణ్ మరికొంత కాలం వైద్య పర్యవేక్షణలో ఉండనున్నారు.

Advertisement
Advertisement