మన పత్రిక, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రిటైర్డ్ ఇంజినీర్లను జైలుకు పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యల పట్ల రిటైర్డ్ ఇంజినీర్ శ్యాంప్రసాద్ రెడ్డి (Shyam Prasad Reddy) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సర్వీసులో తాను ఎంతో నిష్టతో పని చేశానని, ఇప్పుడు ఇలాంటి అపనిందలను భరించలేకపోతున్నానని ఆయన కంటతడి పెట్టారు. గతంలో మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని తాము వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలను సీఎం విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇప్పటికే సమాచారం అందించామని శ్యాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో సాగునీరు, తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
