Advertisement

ముంబైలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన చంద్రబాబు

మన పత్రిక, ముంబై: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భుజానికి జరిగిన శస్త్రచికిత్స అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన్ను ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు.

గతంలో సినిమా షూటింగుల్లో జరిగిన ప్రమాదాల వల్ల పవన్ కల్యాణ్ పాత గాయాలతో బాధపడుతున్నారు. దీనికి సంబంధించి ముంబైలోని ఆసుపత్రిలో ఆయనకు వైద్యులు మూడున్నర గంటల పాటు సంక్లిష్టమైన శస్త్రచికిత్సను నిర్వహించారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై వైద్యులతో చంద్రబాబు చర్చించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ధైర్యం చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ సీఎం ఆరోగ్య వివరాలను వైద్యుల నుంచి చంద్రబాబు స్వయంగా తెలుసుకున్నారు.

Advertisement
Advertisement