Advertisement

వంద కోట్ల క్లబ్‌లో సమంత నటించిన మా ఇంటి బంగారం

మన పత్రిక, హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన 24 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి అరుదైన మైలురాయిని చేరుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కథానాయిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడం ఇదే మొదటిసారి.

ఈ చిత్రాన్ని సమంత తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ (Tralala Moving Pictures) బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. బలమైన కథనం, ప్రేక్షకుల నుంచి వస్తున్న సానుకూల స్పందనతో ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

Advertisement
Advertisement