Advertisement

కోదాడలో బీఆర్ఎస్ భారీ ధర్నా: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసన

మన పత్రిక, కోదాడ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కోదాడ బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ (BRS) పార్టీ నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం కొనసాగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ముఖ్యమంత్రి హోదాలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మల్లయ్య యాదవ్ విమర్శించారు.

రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాలనపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం రాజకీయ విమర్శలతో కాలం గడపడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన తీరు మార్చుకోకపోతే కోదాడ నుండి మరో ఉద్యమం మొదలవుతుందని ఆయన హెచ్చరించారు.

Advertisement
Advertisement