మన పత్రిక, వెబ్‌డెస్క్
భారతదేశంలో బంగారం ధర ఈ సంవత్సరం లక్షా 25 వేల రూపాయలకు చేరుతుందని ఐసిఐసిఐ బ్యాంక్ తన సరికొత్త నివేదికలో వెల్లడించింది. ప్రస్తుత ధరల పోకడలను పరిశీలించిన తర్వాత ఈ అంచనాను రూపొందించారు. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే బలహీనపడటం, అంతర్జాతీయ ఆర్థిక వాతావరణం, ఫెడ్ వడ్డీ రేట్లలో సడలింపు, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరలను భారీగా పెంచేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) వైపు మొగ్గు చూపుతున్నారు. 2025 జూలైలో రూ. 12.6 బిలియన్ల నికర పెట్టుబడిని మదుపరులు గోల్డ్ ETFల్లో పెట్టారు. గోల్డ్ ETFల్లో పెట్టుబడి పెరగడం బంగారం పట్ల పెట్టుబడిదారుల నమ్మకాన్ని సూచిస్తోంది. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో పెట్టుబడి కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ అంచనా ప్రకారం, బంగారం ధరలు ఇప్పటి స్థాయి నుంచి మరింత పెరిగి లక్షా 25 వేల స్థాయికి చేరుకుంటాయి.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
