మన పత్రిక, సౌత్ కొరియా: శామ్సంగ్ సంస్థ త్వరలో విడుదల చేయనున్న గెలాక్సీ ట్యాబ్ S12+ ఫస్ట్ లుక్ ఆన్లైన్లో లీక్ అయ్యింది. ఈ కొత్త ట్యాబ్లెట్ మోడల్ 14.6 అంగుళాల భారీ డిస్ప్లేతో రానుంది. ఇందులో సెల్ఫీ కెమెరాను డిస్ప్లే బెజెల్‌లోనే అమర్చినట్లు సమాచారం. ఈ పరికరం వై-ఫై (Wi-Fi) మరియు 5G వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.
ఈ ట్యాబ్లెట్లో 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9500 (MediaTek Dimensity 9500) చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారు. సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ కోసం 11,600mAh సామర్థ్యం గల బ్యాటరీని అందించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ చివరి నాటికి దీనిని మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
