Advertisement

భద్రాచలానికి పోలవరం ప్రాజెక్టుతోనే ముప్పు: కేటీఆర్

మన పత్రిక, హైదరాబాద్: భద్రాచలానికి అసలైన ముప్పు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కాదని, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపు వల్లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మేడిగడ్డ బారేజీని నీటితో నింపితే భద్రాచలం మునిగిపోతుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని ఆయన విమర్శించారు.

పక్క రాష్ట్రంలో పట్టిసీమ ద్వారా నీటిని ఎలా ఎత్తిపోస్తున్నారో చూసి నేర్చుకోవాలని సీఎంకు సూచించారు. కన్నెపల్లి పంపుహౌస్ మోటార్లను ఆన్ చేసి, రైతులకు సాగునీరు అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేవలం రాజకీయం కోసం ప్రాజెక్టులను బూచిగా చూపిస్తూ, అసలైన ప్రమాదాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Advertisement
Advertisement