Advertisement

Peddi : వీకెండ్ బ్లాస్ట్ పెద్ది @250కోట్లు… ఇక మీదుంటది అసలు సవాల్!

రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ ఫైనల్ గా జూన్ 4న థియేటర్లలో విడుదలై సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. టాక్ తో సంబంధం లేకుండా అదిరిపోయే ఓపెనింగ్స్ అందుకున్న ఈ మూవీ వీకెండ్ లో భారీ కలెక్షన్లు సాధించింది.

ఇక ఫస్ట్ డే నే పెద్ది మూవీ 120 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేయగా, పెద్ది నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ లో 250 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక 220 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో ఆల్మోస్ట్ నాలుగు రోజుల్లోనే అరవై శాతానికి పైగా రికవరీ చేసినట్టు సమాచారం. మొదటి వారం ముగిసే సరికి 300 కోట్ల మార్క్ దాటడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

Advertisement

అయితే ఇతర భాషల్లో అలాగే ఓవర్సీస్ లో పెద్ది అంతగా ప్రభావం చూపించట్లేదు. అందువల్ల మేజర్ కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల పైనే ఆధారపడి ఉన్నాయి. అయితే సోమవారం నుండి వర్కింగ్ డేస్ ఉన్నాయి కాబట్టి ఈరోజు నుండే పెద్దికి అసలు పరీక్ష స్టార్ట్ అవనుందని తెలుస్తుంది. మరి చాలా రోజుల తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సినిమా రావడంతో తెలుగు ఆడియన్స్ పెద్దిని ఎంత ఆదరిస్తారో చూడాలి.

Advertisement