Advertisement

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

మన పత్రిక, వెబ్​డెస్క్

Advertisement

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పర్యటించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆయన అశ్వరావుపేట నియోజకవర్గం, చండ్రుగొండ మండలం(Chandrugonda), బెండాలపాడు గ్రామానికి విచ్చేయనున్నారు. మధ్యాహ్నం 2:20 గంటలకు హెలికాప్టర్‌లో చేరుకున్న సీఎం, ఇందిరమ్మ ఇండ్ల పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం ఇద్దరు గిరిజన మహిళా లబ్ధిదారుల ఇళ్లకు గృహప్రవేశం చేయించి, వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించనున్నారు.

Advertisement

సాయంత్రం 3:15 నుండి 4:15 గంటల వరకు దామరచర్ల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ సభకు లక్ష మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. సాయంత్రం 4:20 గంటలకు ఆయన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement