Advertisement

Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీగా తెరకెక్కుతున్న “పెద్ది” (Peddi) కోసం రామ్ చరణ్ (RamCharan) ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన పెద్ది పలు కారణాలతో వాయిదా పడగా, వారం రోజుల షూట్ మాత్రమే బాకీ ఉందని, బుచ్చిబాబు (Buchubabu) క్లారిటీ ఇచ్చాడు. అయితే తాజాగా పెద్ది టీం కి పెద్ద షాకే ఇచ్చారు నెటిజన్లు. సోషల్ మీడియా లో పెద్ది కి సంబంధించి స్పెషల్ సాంగ్ లీక్స్ విజువల్స్ వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం పెద్ది కి సంబంధించి ఓ ఐటెం సాంగ్ షూటింగ్ జరుగుతుందన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సాంగ్ లో ఉండే హీరోయిన్ ఎవరన్న విషయం ఇప్పటివరకు చెప్పలేదు మేకర్స్. అయితే తాజాగా లీక్ అయిన విజువల్స్ ని బట్టి చూస్తే.. శృతి హాసన్ (Shruthi hasan) ఉండే ఛాన్స్ ఉందని నెట్టింట వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సాంగ్ షూట్ పూర్తయితే దాదాపు సినిమా షూట్ మొత్తం పూర్తయినట్టే అని చెప్పాలి.

Advertisement

ఇక సినిమా ప్రమోషన్లు అతి త్వరలోనే మొదలవనుండగా, పాన్ ఇండియా భాషల్లో పెద్ది రిలీజ్ కానుంది. అయితే పెద్ది నుండి లీక్ అయిన విజువల్స్ ని సోషల్ మీడియాలో తొందర్లోనే రిమూవ్ చేయించి, ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా మేకర్స్ చర్యలు తీసుకోనున్నారని సమాచారం.

Advertisement