మన పత్రిక, వెబ్డెస్క్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఈ నెల 5న అరకులోని మాడగడ గిరిజన గ్రామంలో పర్యటించనున్నారు. జనసేన పార్టీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ పర్యటనలో ఆయన గిరిజనుల సంప్రదాయ ఉత్సవం ‘బలి పొరోబ్’లో పాల్గొంటారు. ఈ ఉత్సవం 12 రోజుల పాటు కొనసాగుతుంది. గత నెల 25న ప్రారంభమైంది. గిరిజనుల ప్రత్యేక ఆహ్వానం మేరకు చివరి రోజున పవన్ కళ్యాణ్ హాజరవుతారు.మాడగడ గ్రామం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉంది. ఇక్కడ జరిగే బలి పొరోబ్ వేడుకల్లో ఒడిశాకు చెందిన ఆదివాసీలు కూడా పాల్గొంటారు. ఈ ఉత్సవం గిరిజన సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
