టాలీవుడ్ లో ఈ సమ్మర్ లో పెద్ద సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోతున్న సంగతి తెలిసిందే. వచ్చిన చిన్న సినిమాలు కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఎంతో కొంత రెండు వారాల కింద వచ్చిన డెకాయిట్ థియేటర్లకు కాస్త ఊపునిచ్చింది. ఇక ఇప్పుడు మళ్ళీ థియేటర్లలో సరైన సినిమా లేక ఆడియన్స్ కూడా ఆసక్తి చూడడం లేదు. దీనికి తోడు ఐపీఎల్ ఎఫెక్ట్ ఇండస్ట్రీ పై గట్టిగా పడింది. ఈ క్రమంలో టాలీవుడ్ లో తాజాగా రీ రిలీజ్ అయిన సినిమానే థియేటర్లకు దిక్కయింది.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన డార్లింగ్ మూవీ అప్పట్లో మంచి హిట్టయింది. దాదాపు 16 ఏళ్ళ తర్వాత ఇప్పుడు డార్లింగ్ మూవీని సమ్మర్ స్పెషల్ గా థియేటర్లలో రీ రిలీజ్ చేసారు మేకర్స్. మొదట ఈ సినిమా గురించి పెద్దగా పట్టించుకోరు అనుకున్నా, అదిరిపోయే బుకింగ్స్ తో థియేటర్ల వద్ద సందడి చేస్తుంది డార్లింగ్ మూవీ. ఏప్రిల్ 23న రిలీజ్ అయిన 3 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ తో ఓపెన్ అవగా, ఫస్ట్ డే 5 కోట్ల వరకు రావొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇక ఈ వారం రెండు చిన్న సినిమాలు రిలీజ్ ఉన్నా కూడా డార్లింగ్ సినిమాకు ఈ రేంజ్ బుకింగ్స్ రావడం విశేషమే. మరి వీకెండ్ ముగిసే సరికి డార్లింగ్ మూవీకి ఎలాంటి కలెక్షన్లు వస్తాయో చూడాలి.
ఇవి కూడా చదవండి :
- TG Inter Supplementary Results 2026: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
- Suryapet : ట్రాక్టర్ పై నుంచి జారిపడి వ్యక్తి మృతి..
- NEET UG 2026 : నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్కి భారీ భద్రత!
- Peddi : వీకెండ్ బ్లాస్ట్ పెద్ది @250కోట్లు… ఇక మీదుంటది అసలు సవాల్!
- School Summer Holidays : స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు..
