పవర్ స్టార్ Pawan Kalyan నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ Ustaad Bhagat Singh థియేటర్లలో ఆశించిన రేంజ్ లో ఆడకపోయిందన్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ రొటీన్ కథా కథనాలతో ఉస్తాద్ నిరాశపరిచాడు. పైగా ఇదే సమయంలో బాలీవుడ్ మూవీ దురంధర్ ఎఫెక్ట్ ఉస్తాద్ పై గట్టిగా పడింది. కాగా తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ ఓటిటి లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
రీసెంట్ గా ప్రముఖ ఓటిటి దిగ్గజం Netflix లో రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టాక్ తో సంబంధం లేకుండా నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. దాదాపు నేషనల్ వైడ్ గా టాప్ 5 లో ట్రెండ్ అవుతుండడం విశేషం. థియేటర్లలో భారీ లాస్ తెచ్చిన ఈ సినిమా ఓటిటి బయ్యర్లకు మాత్రం మంచి లాభాలు తెచ్చిపెడుతుందని సమాచారం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రెగ్యులర్ మూవీ లవర్స్ మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక ఈ మూవీలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించగా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. థమన్ బీజీఎమ్ అందించాడు. ఇక Mythri Movie Makers నిర్మించిన ఈ సినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- Railway Jobs 2026: రైల్వేలో 4,098 ఉద్యోగాలు.. ఏయే పోస్టులు? పూర్తి వివరాలు
- విద్యార్థులకు పండుగల పండగ.. ఆగస్టు సెలవుల లిస్ట్ వచ్చేసింది! | Telangana School Holidays August 2026
- పెరూలో 5.3 తీవ్రతతో భూకంపం సునామీ ముప్పు లేదని స్పష్టత
- ఈనెల 24న ఎల్లారెడ్డిలో మెగా జాబ్ మేళా
- ఆగస్టు 07 రాశిఫలాలు: ద్వాదశ రాశుల వారి ఫలితాలు, సూచనలు
