మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతూ తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న 20 అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II) పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 27 నుంచి మే 25 సాయంత్రం 5 గంటల వరకు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) చేసుకున్న వారు తమ ఐడీతో లాగిన్ అయి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
Advertisement
ఈ పోస్టుల ఎంపిక కోసం జులై 2026లో కంప్యూటర్ ఆధారిత (CBRT) రాత పరీక్షను నిర్వహించనున్నారు. వివిధ సెషన్లలో పరీక్ష జరిగితే నార్మలైజేషన్ పద్ధతిలో మార్కులను లెక్కిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
Advertisement
