8th Pay Commission pension hike 2026 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారుల ఆశలు 8వ వేతన సంఘంపై నిలిచాయి. ఈ సంఘం అమలు అయితే భారీ ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని అంచనా. జీతాలతో పాటు పింఛన్లు కూడా గణనీయంగా పెరగనున్నాయి. 7వ వేతన సంఘం 2025 డిసెంబర్ 31తో ముగుస్తుంది. 2026 జనవరి 1 నుంచి 8వ వేతన సంఘం అమలు కానుంది. దేశంలో 48 లక్షలకు పైగా ఉద్యోగులు, 67 లక్షలకు పైగా పింఛన్దారులు ఉన్నారు. వారందరికీ ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది.
ఫిట్మెంట్ కారకం 2.28 శాతం నుంచి 3 శాతం పరిధిలో ఉంచే అవకాశం ఉంది. దీంతో కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.21,600కు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల జీతాలు దాదాపు 34.1 శాతం పెరగొచ్చు. డీఏ (డీఅర్నెస్ అలవెన్స్) లో కూడా భారీ పెరుగుదల ఉండొచ్చు. పింఛన్దారులకు కూడా శుభవార్త ఉంది. కనీస పింఛన్ రూ.9,000 నుంచి రూ.20,500కు పెరగొచ్చని చర్చ జరుగుతోంది.
అక్టోబర్ లేదా నవంబర్ 2025లో 8వ వేతన సంఘం కమిటీ ఏర్పడే అవకాశం ఉంది. కమిటీ మంత్రిత్వ శాఖలు, కార్మిక సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తుంది. సిఫార్సుల ఆధారంగా నివేదిక ప్రభుత్వానికి అందిస్తుంది. సవ్యంగా సాగితే 2026లోనే అమలు అవుతుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
