Today Horoscope : 30 అక్టోబర్ 2025, గురువారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : మీ లక్ష్యం ఏంటో దానిపైనే దృష్టి పెట్టండి. ఏమాత్రం ఏకాగ్రత కోల్పోయినా లక్ష్యానికి దూరమవుతారు. సవాళ్లు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
వృషభం : ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుంది. మీరు చేసిన పనికి ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా బాగుంటుంది.
మిథునం : మనోబలంతో ముందుకెళ్లండి. ఏ పని ప్రారంభించినా విజయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారి ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.
కర్కాటకం : ధన వ్యయం అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు సహనంతో ఉండాలి. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు.
సింహం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. మీ ఆలోచనలే మీకు ఉన్నతిని అందిస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు.
కన్య : శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
తుల : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి పనికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు.
వృశ్చికం : శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు : శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి విజయం వరిస్తుంది.
మకరం : మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి.
కుంభం : ఏ పని చేసినా ఏకాగ్రతతో చేయండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మీనం : ఏ పని ప్రారంభించినా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

