Advertisement
17 members died in chevella bus accident

Chevella Bus Accident : చేవెళ్ల బస్సు ప్రమాదంలో 17 మంది మృతి

Chevella Bus Accident : ఇవాళ ఉదయం చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మండలంలోని మీర్జాగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. సింగిల్ రోడ్ కావడం, డివైడర్ లేకపోవడంతో పాటు మలుపు వద్ద ఓవర్ స్పీడ్ తో ఉన్న కంకర లోడ్ తో వెళ్తున్న టిప్పర్ బస్సును బలంగా ఢీకొనడంతో బస్సు తుక్కుతుక్కు అయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. ఉదయం 4.30 కు బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరింది. బస్సులో సుమారు 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రికి తరలించిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఉదయం ఆరు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి దగ్గర బంధువుల రోదనలు మిన్నంటాయి. తీవ్రంగా గాయపడిన వాళ్లను హైదరాబాద్ కు పంపించి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్డు మీద ఉన్న గుంతను తప్పించబోయిన టిప్పర్ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టినట్టు తెలుస్తోంది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో కొందరికి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement