Advertisement

Horoscope 13 Oct 2025 : 13 అక్టోబర్ 2025 సోమవారం రాశి ఫలాలు

Today Horoscope : 13 అక్టోబర్ 2025, సోమవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.

Advertisement

మేషం : ఉద్యోగ, వ్యాపార, వృత్తి రంగాల్లో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ఉండండి.   

Advertisement

వృషభం : ఆరోగ్యం సహకరిస్తుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కొంచెం ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. కానీ, మనోధైర్యాన్ని కోల్పోవద్దు.

మిథునం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. చేపట్టిన పనులు ఆలస్యం అవుతాయి. ప్రణాళికతో ముందుకెళ్తే పనులు పూర్తవుతాయి.

Advertisement

కర్కాటకం : వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ముఖ్యమైన పనుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి.

సింహం : బంధువుల ప్రోత్సాహం మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.

కన్య : ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తారు.

తుల : ప్రయాణాలు చేస్తారు. సమాజంలో పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది.  

వృశ్చికం :  ఎలాంటి సమస్యలు వచ్చినా ఓపికతో ఉంటారు. పట్టుదలతో ముందుకు సాగిపోతారు. కొందరు వ్యక్తుల వల్ల మీకు చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది. కానీ, మీ ఓపికతో వాటిని ఎదుర్కొంటారు.

ధనుస్సు : ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలు చేస్తారు.  

మకరం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. బుద్ధి బలం ఉంటుంది.

కుంభం : మనోబలం మీకు ఉత్సాహాన్ని అందిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. అధికారులతో సఖ్యతతో ఉంటారు.   

మీనం : తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. బుద్ధిబలంతో అనుకున్నవన్నీ సాధిస్తారు. ముందుచూపు వల్ల ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటారు.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement