Today Horoscope : 01 నవంబర్ 2025, శనివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. శుభవార్త వింటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది.
వృషభం : ప్రయాణాలు చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. డబ్బు ఖర్చు చేస్తారు. దాని వల్ల మానసికంగా ఆందోళన చెందుతారు. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
మిథునం : కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. పట్టుదలతో ముందుకెళ్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
కర్కాటకం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల సహకారం లభించదు. కార్యాలు మొదలు పెట్టకముందే వాయిదా పడతాయి. ఆరోగ్యం సహకరించదు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.
సింహం : ఏ పని ప్రారంభించినా ఆటంకాలు ఎదురవుతాయి. ఆస్తుల విషయంలో జాగ్రత్త. మోసపోతారు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవుతాయి. కొత్త పనులు ఏవీ ప్రారంభించకండి. ప్రయాణాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
కన్య : ప్రయాణాలు చేస్తారు. ఫుడ్ విషయంలో అశ్రద్ధ చేయడం వల్ల ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. చిన్న చిన్న విషయాలకు మానసిక ఆందోళన చెందకండి. ప్రయాణాల్లో జాగ్రత్త. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలి.
తుల : బంధు మిత్రులతో విరోధం ఏర్పడుతుంది. ప్రయత్న కార్యాలు చేస్తారు కానీ ఫలించవు. చిన్న చిన్న విషయాలకు మనస్థాపం చెందుతారు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.
వృశ్చికం : సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ప్రయాణాలు చేస్తారు. కానీ మానసిక ఆందోళన ఇబ్బంది పెడుతుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు.
ధనుస్సు : కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. అనారోగ్యం బాధిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఆటంకాలు ఎదురవుతాయి.
మకరం : ముఖ్యమైన సమాచారం అందుతుంది. ధన లాభం ఉంటుంది. విజయాలు సాధిస్తారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు.
కుంభం : కుటుంబ సభ్యుల సౌఖ్యం లభిస్తుంది. మానసిక ఆనందాన్ని పొందుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. శుభవార్తలు వింటారు.
మీనం : ప్రయాణాలు చేస్తారు. భయాందోళన వద్దు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితులు అంతగా సహకరించవు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
