Advertisement

Durandhar2 @1500+ : దురంధర్ సీక్వెల్ భారీ రికార్డు.. కానీ ఆ అసలైన రికార్డు సాధ్యం కాదా?

బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా నటించిన ధురంధర్ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో తెలిసిందే. దానికి సీక్వెల్ గా దురంధర్ ది రివెంజ్ పేరుతో రీసెంట్ గా విడుదలై రెండో పార్ట్ కూడా భారీ సక్సెస్ అయింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ విడుదలై మూడు వారాలైనా ఇప్పటికి స్టడీ కలెక్షన్లతో థియేటర్లలో అదరగొడుతుంది. తాజాగా దురంధర్ ది రివెంజ్ అదిరిపోయే రికార్డు సాధించింది.

మార్చి 19న విడుదలైన దురంధర్ ది రివెంజ్ మూవీ వరల్డ్ వైడ్ గా 1500 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది. తాజాగా 1560 కోట్ల మార్క్ దాటి అల్ టైం ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచే దిశగా దూసుకుపోతుంది. నిజానికి ఈ సినిమా విడుదలయ్యే సమయంలోనే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసి భారీ రికార్డులు సెట్ చేస్తుందని అనుకున్నారు అందరూ. కానీ ప్రస్తుతం ఈ వారం విడుదల కాబోయే ఇతర సినిమాల పోటీ వల్ల అరుదైన ఓ రికార్డుకి దురంధర్ దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది.

Advertisement

అదేంటంటే దురంధర్ ది రివెంజ్ 2000 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి. అనుకున్నట్టుగానే ఓపెనింగ్స్ తోనే రికార్డు కలెక్షన్లు వచ్చాయి. కానీ క్లోసింగ్ కి వచ్చే సరికి రెండు వేల కోట్ల క్లబ్ అసాధ్యం అని పరిస్థితులు చెప్తున్నాయి. మరి లాంగ్ రన్ లో ఇతర సినిమాల పోటీని తట్టుకుని దురంధర్ ది రివెంజ్ 2000 కోట్ల క్లబ్ లో జాయిన్ అవుతుందా లేదా అనేది చూడాలి.

Advertisement